అనాథ పిల్లలతో.. హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్
సాధారణంగా సినిమా తారలు తమ పుట్టిన రోజును పెద్ద పెద్ద హోటల్స్, రిసార్ట్స్ లలో సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరైతే ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో బర్త్ డేను గ్రాండ్ గా జరుపుకొంటారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన బర్త్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది.
హైదరాబాద్ లోని లెప్రా సొసైటీ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి చిన్నారులతో తన పుట్టినరోజు వేడుకలను చేసుకుంది. అంతేకాదు పిల్లలతో సరదాగా ఆడిపాడింది. వారితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసింది. అనంతరం చిన్నారులకు విలువైన బహుమతులు అందించింది. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేసింది. ఈ వేడుకల్లో వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్‌దేవ్ కూడా పాల్గొన్నాడు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని చెప్పింది వరలక్ష్మి. తనలాగే మరికొందరు సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరలక్ష్మి గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే

గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూడగా !!

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
