ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూసి షాక్..
అడవుల్లో తిరిగే భారీ నాగు పాములు ఇపుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్న పామును చూస్తేనే భయంతో హడలెత్తిపోతాం. అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లో పడగవిప్పి బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తెలగ రామవరం పంచాయతీలోని నారసాని నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో నాగుపాము చొరబడింది. ఆ ఇంటి మహిళ ఎప్పటిలాగే వంట చేసేందుకు కిచెన్‌లోకి వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు అక్కడ వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని అంతా పరిశీలించింది. గ్యాస్ గానీ లీకవుతుందేమోనని చెక్ చేసింది. అలాంటిదేమీ లేకపోగా శబ్దాలు కంటిన్యూ అవుతుండటంతో అనుమానించిన ఆమె పక్కనే ఉన్న బీరువా పైకి చూసింది. అంతే ఒక్క ఉదుటన కిచెన్‌లోంచి ఇవతలికి వచ్చేసింది. బీరువాపై ఓ పెద్ద నాగుపాము పడగవిప్పి కూర్చుని బుసలు కొడుతోంది. ఇంట్లోవారికి విషయం చెప్పింది. అంత పెద్దపామును చూసిన వారికి నోటమాట రాలేదు. విషయం తెలుసుకుని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ మహేష్, పి.బలరాం పామును చాకచక్యంగా బంధించి అడవిలో వదిలిపెట్టారు. శుక్రవారం తమ ఇంటి ఆవరణలో ఈ పాము కనిపించిందని, వెళ్లిపోతుందిలే అనుకుంటే తెల్లారేసరికి బీరువాపైకి ఎక్కి బుసలు కొడుతూ కనిపించిందని నర్సయ్య తెలిపారు. పామును బంధించి అడవిలో వదిలివేయడంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ.. వీరి సంపద ఎంతంటే..
ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

