ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు
ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం ఏది అంటే ఇడ్లీ అని టక్కున చెప్తారు. ఎలాంటి నూనె, మసాలాలు లేకుండా ఆవిరిపైన ఉడికే ఈ ఇడ్లీ అందరికీ ఎంతో ఆరోగ్యకరం. అందుకే వైద్యులు కూడా పేషెంట్లకు సైతం ఇడ్లీ పెట్టమని సూచిస్తారు. ఇంత ఆరోగ్యకరమైన ఇడ్లీ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది కర్నాటక ఆహార భద్రతా విభాగం.
అవును, ఇడ్లీ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకు కారణం ఇడ్లీ తయారుచేసే విధానంలో లోపమే అంటున్నారు. ముఖ్యంగా హోటల్స్ ఇడ్లీ తయారుచేయడంలో ఇలాంటి అనారోగ్యకరమైన విధానాన్ని ఫాలో అవుతున్నాయని కర్నాటక ఆహార భద్రతా విభాగం తేల్చింది. సుమారు 251 హోటళ్ళు, రోడ్‌సైడ్ విక్రేతల వద్ద 500 ఇడ్లీల నమూనాలను బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు. రిజల్ట్స్‌లో 51 నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు. నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని, వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని సూచించారు. ఇడ్లీ పిండిని సాంప్రదాయకంగా తాజా కాటన్ బట్టలపై పెట్టి.. తరువాత వాటిని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరితో ఉడికిస్తారు. అయితే అనేక హోటళ్ళు, వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ షీట్లకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ ప్లాస్టిక్స్ వేడి చేసినప్పుడు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని.. వాటిలో కొన్ని క్యాన్సర్ కారకమైనవి కావచ్చని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు..’ ఫీలవుతున్న సమంత!
అనాథ పిల్లలతో.. హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
