“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
అమెరికన్ గ్రీన్ కార్డ్.. లక్షల మందికి అందని ద్రాక్ష. ఇప్పుడు ట్రంప్ నోట గ్రీన్ కార్డ్ మాట వచ్చింది. గ్రీన్ కార్డు ఇచ్చేస్తానంటున్నారు ట్రంప్. అయితే మళ్లీ ఇక్కడో తిరకాసు పెట్టారు. ఇది అందరికీ కాదు.. గ్రీన్ కార్డ్ కావాలంటే మరో కార్డు తీసుకోవాలని అంటున్నారు. ఆ కార్డు పేరే గోల్డ్ కార్డ్. అది కూడా అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమేనట.
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ కొత్త విధానం తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే “గోల్డ్ కార్డ్” ఇస్తామంటున్నారు. గోల్డ్ కార్డ్ కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. గ్రీన్ కార్డ్‌కి గోల్డ్ కార్డ్‌కి మధ్య తేడా ఏంటి? గ్రీన్‌కార్డ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనీ, గోల్డ్ కార్డ్ కొంటే గ్రీన్‌కార్డ్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? 1990 నుంచి అమలవుతున్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డ్ తీసుకురావడం వెనక మతలబేంటి? ఈ అంశంపై రెండు వారాల్లో క్లారిటీ వస్తుందా? వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు 1990లో EB-5 విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో “గోల్డ్ కార్డ్” విధానం తీసుకొస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్!
ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్.. సింగిల్ ప్రీమియంపై నెలనెల పెన్షన్.. ఎంతంటే

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
