గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
యూత్ వీకెండ్స్ ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఫస్ట్ ఆప్షన్ గోవా... బీచ్‌లో స్నానం చేస్తూ బీర్‌లతో చిల్ అయ్యేందుకు దేశవిదేశాలనుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు క్యూ కడతారు. కానీ ఇటీవల గోవాకు పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనికి కారణం ఇడ్లీ సాంబరేనని ఓ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గోవాలో గత కొంతకాలంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి బీచ్‌లో వడా పావ్, ఇడ్లీ-సాంబార్ విక్రయించడం వల్లే విదేశీ పర్యాటకులు రావడం లేదన్నారు. దక్షిణ గోవాలోని కలంగూట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి వచ్చినవారు బీచ్‌లోని షాపుల్లో వడా పావ్‌లు విక్రయిస్తున్నారని, మరికొందరు ఇడ్లీ-సాంబార్ అమ్ముతున్నారని అన్నారు. అందుకే గడిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల తాకిడి తగ్గిందని పేర్కొన్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అని ఎమ్మెల్యే లోబో చెప్పుకొచ్చారు. అయితే, ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు ఏ విధంగా గోవా పర్యాటకంపై ప్రభావం చూపాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్!
ఎల్‌ఐసీ నుంచి కొత్త స్కీమ్.. సింగిల్ ప్రీమియంపై నెలనెల పెన్షన్.. ఎంతంటే

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
