అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు మొదలైనట్టున్నాయి. వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా ఓ జింక ఆహారం కోసం వచ్చిందో, నీటి కోసమే వచ్చిందో కానీ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. పాపం పైకి వచ్చే మార్గం లేక నిస్సహాయంగా అటు ఇటూ తిరుగుతూ ఉండిపోయింది.
అటుగా వచ్చిన గ్రామస్తులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల్ గ్రామం సమీపంలో వ్యవసాయ పొలాల్లోకి వచ్చింది ఓ చుక్కల జింక. నీటికోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ జింక పాపం పొరపాటున వ్యవసాయ బావిలో పడిపోయింది. బయటపడే మార్గం లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఎవరైనా తనను చూడకపోతారా.. రక్షించకపోతారా అన్నట్టుగా బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఇంతలో అటుగా వెళ్తున్న వ్యవసాయ కూలీలు బావిలో జింకను చూసారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చే లోపే వ్యవసాయ కూలీలు బావిలో దిగి జింకను కాపాడారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బందికి జింకను అప్పగించారు. జింకను అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్టు ఎఫ్‌ఆర్‌ఓ గీతారాణి తెలిపారు. వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులను ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
కార్ యాక్సిడెంట్ జరిగిందా? కంగారు పడకండి.. ఈ పనులు చేస్తే అంతా సేఫ్!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
