తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు. బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా రష్యాలో ఓ మహిళ చేసిన పని ఎంతో మందిని కదిలిస్తోంది. ఆమె తన బిడ్డకు రక్షణ కవచంలా నిలిచి పోరాడింది.
తను రక్తమోడుతున్నా బిడ్డ ఒంటిపై చిన్న గీత కూడా లేకుండా కాపాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోట్‌వీలర్ కుక్క చాలా ప్రమాదకరమైనది. చిన్న పిల్లలపై దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. చాలా దేశాల్లో రోట్‌వీలర్ కుక్కలను పెంచుకోవడాన్ని నిషేధించారు. అయితే రష్యాలో ఓ ఐదేళ్ల బాలుడిపై దాడి చేసేందుక రోట్‌వీలర్ కుక్క ప్రయత్నించింది. అయితే ఆ కుక్కకు ఆ బాలుడి తల్లి ఎదురు నిలిచింది. తన బిడ్డకు రక్షక కవచంలా నిలిచి ఆ కుక్కకు దొరక్కుండా చేసింది. దీంతో ఆ కుక్క మహిళపై దాడి చేసింది. కుక్క కాటు వల్ల ఆ మహిళకు తీవ్ర గాయమైంది. అయినా ఆ మహిళ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన బిడ్డపై చిన్న గీత కూడా పడనివ్వలేదు. ఆమె అరుపులు విని పక్కనున్న వాళ్లు అక్కడకు వచ్చారు. అక్కడకు వెళ్లిన వారిపై కూడా దాడి చేసేందుకు ఆ కుక్క ప్రయత్నించింది. ఈ ఘటన మొత్తాన్ని కారులో కూర్చున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు.
మరిన్ని వీడియోల కోసం :
అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో
అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో
ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
