92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
మహాశివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు, పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. శివరాత్రి పర్వదినాన వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తారు. ఎవరు ఏం చేసినా భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధించేందుకే. మహాదేవుని ఆశీస్సులు పొందేందుకే. రోజంతా ఉపవాసదీక్షను ఆచరించి, సాయంత్రం ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి, స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.
ఈ క్రమంలో ప్రాంతాల వారీగా వారి వారి ఆనవాయితీలను అనుసరించి ప్రత్యేక నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు. అలా తమిళనాడులో ఓ భక్తురాలు కాగుతున్న నూనెలో నుంచి చేత్తో అప్పాలను తీస్తూ స్వామివారికి నైవేద్యం తయారు చేసింది. ఇది అక్కడి ఆచారమట. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ ముదలియార్‌పట్టి వీధిలో భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో – బియ్యం, తాటిబెల్లంతో తయారు చేసిన లడ్డూలవంటి అప్పాలను శివుడికి నైవేద్యంగా పెట్టడం ఇక్కడి ఆనవాయితీ. అయితే.. అప్పాన్ని వేడి నెయ్యిలోంచి గరిటె వాడకుండా తీయాల్సి ఉంటుంది. శతాబ్ద కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని.. 52 సంవత్సరాలుగా 92 ఏళ్ల ముత్తమ్మాళ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

