వేసవిలో ఈ కూరగాయ తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు వీడియో
ఈ ఏడాది వేసవి కాస్త త్వరగానే వచ్చేసిందా అనిపిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరినుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వాతావరణశాఖ అధికారులు కూడా ఈ ఏడాది ఎండలు ఎక్కవగా కాస్తాయని హెచ్చరికలు సైతం చేశారు. మార్చి నెలలో తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధారణంగా వేసవిలో ఎక్కువగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని ఆహారాలను సైతం సూచిస్తుంటారు వైద్యనిపుణులు. వాటిలో ముఖ్యమైనది ముల్లంగి. వేసవిలో ముల్లంగి తీసుకోవడం వల్ల చాలా మంచిదంటున్నారు నిపుణులు. ముల్లంగిలో పైబర్, నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రో
జువారీ ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ముల్లంగిలో ఉండే ఆరోగ్యకరమైన ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రేగుల్లోని వ్యర్థాలు తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ముల్లంగి రసం పేగు కణజాలాన్ని రక్షిస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్‌ని నివారించడంలో బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకుంటే.. పేగు పొట్టలో పుండ్లు, మంట సమస్య తగ్గుతుంది. కాలేయ సమస్యలను సరిచేయడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కప్పు ముల్లంగిలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, బిలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే క్యాన్సర్‌కి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాల నుండి కణాలను రక్షించే గ్లూకోసినోలేట్స్, సల్ఫర్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణితుల పెరుగుదలని కూడా తగ్గిస్తుంది. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే ముల్లంగి, గుమ్మడికాయ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరం పొడిబారడాన్ని తగ్గించి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం :
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో
వామ్మో.. ఈ పాక్ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
