Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజమే..టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. చాయ్‌వాలీనే కానీ బహుభాషా ప్రజ్ఞాశాలి

నిజమే..టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. చాయ్‌వాలీనే కానీ బహుభాషా ప్రజ్ఞాశాలి

Phani CH

|

Updated on: Mar 08, 2025 | 12:13 PM

పట్టుదల కృషి ఉండాలే కానీ ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాలను చేరుకోవచ్చు. ప్రతిభ ఏఒక్కరి సొంతం కాదని నిరూపించే ఎందరో ప్రతిభావంతులను మనం చూశాం. ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో వెలుగులోకి వస్తూ పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. వివాహం విద్య వినాశనం అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో అది నిజం కాదని నిరూపిస్తున్నారు కొందరు.

తాజాగా ఓ యువతి చిన్నబ్రతుకు తెరువు కోసం చాయ్‌ అమ్ముతూ చదువుమీద మక్కువతో ఎం.ఏ. పూర్తి చేసి.. ప్రొఫెసర్‌ కావాలనే లక్ష్యంతో సాగుతూ అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. ఆథ్యాత్మిక పర్యటనలు చేసేవారు బీహార్‌లోని బోధ్‌గయాను తప్పక సందర్శిస్తారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. వారంతా అక్కడ చాయ్‌ అమ్ముకునే ఓ యువతితో తప్పకుండా సెల్ఫీ దిగి వెళ్తుంటారు. పూజాకుమారి అనే ఈ యువతి అక్కడికి వచ్చే పర్యాటకులకు కమ్మటి చాయ్‌తోపాటు బహుభాషల్లో వారిని పలకరిస్తూ అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. ఆమె మాటలకు ముగ్దులైన పర్యాటకులు ఆమెతో సెల్ఫీ దిగాల్సిందే. 9వ తరగతిలో ఉండగా ఉపేంద్రకుమార్‌ అనే రోజుకూలీతో పూజకు పెళ్లయింది. ఆర్థిక ఇబ్బందులున్నా చదువుపై ఆమెకున్న ఆసక్తి తగ్గలేదు. కుటుంబ జీవనం కోసం టీ కొట్టు నడుపుతూనే భర్త ప్రోత్సాహంతో క్రమక్రమంగా ఒక్కో మెట్టు దాటుతూ మగధ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తిచేశారు. పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌ కావడం తన కలగా చెబుతున్న పూజ.. ఇంగ్లిషుతోపాటు జపనీస్, చైనీస్, థాయ్, అమెరికన్‌ ఇంగ్లిష్‌ ధారాళంగా మాట్లాడతారు. మన దేశంలోని పలు రాష్ట్రాల భాషలను అర్థం చేసుకోగలరు. ఇక్కడికి వచ్చే విదేశీయులు, పర్యాటకులే తన భాషా గురువులు, మిత్రులు అని చెబుతారు పూజ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంపముంచిన ఛాయ్.. టీ తాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ

ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం

ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్స్‌

అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్