అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్
ఈ మధ్యన వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోలు గెలుపు రుచి చూసేందుకు దక్షిణ భారత చలనచిత్ర దర్శకుల వైపు దృష్టి సారిస్తున్నారు. షారుఖ్ ఖాన్ మొదట అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘సికంధర్’ సినిమాలో నటిస్తున్నాడు.
ఆమిర్ ఖాన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులు దక్షిణ భారత దర్శకుడిపై పిచ్చ కోపంగా ఉన్నారని న్యూస్. ‘జవాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ కు భారీ హిట్ ఇచ్చిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులను ఆగ్రహానికి గురి కావడానికి ఒక కారణం ఉంది. ‘జవాన్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కోసం కొత్త సినిమా తీస్తానని అట్లీ చెప్పాడు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు చాలా సంతోషించారు. కానీ ఇప్పుడు, అట్లీ అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకుని అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదే సల్మాన్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. తనతో సినిమా తీస్తున్నాడనే కారణంతోనే సల్మాన్ ఖాన్ అట్లీ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో అతిథి పాత్రలో నటించాడు. కానీ ఇప్పుడు చూస్తే, అట్లీ తన రూటు మార్చేశాడు. సల్మాన్ ఖాన్ కోసం తయారు చేసుకున్న కథతోనే అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రంగా ఉంటుందని, మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుందని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్
పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…
అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి చౌదరి
టాటూలు వేయించుకుంటున్నారా.? యమ డేంజర్
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
