అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి చౌదరి
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పుట్టిన రోజు నేడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. అదే సమయంలో కొంతమంది ఫ్యాన్స్ మీనాక్షికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఫ్యాన్స్ పిలుపు కోరిక మేరకు మీనాక్షి చౌదరి కూడా అక్కడికి వెళ్ళింది.
ఇక అక్కడి నుంచి అభిమానుల హడావిడి మొదలైంది. మీనాక్షి ఎంట్రీ ఇవ్వగానే మొదట పేపర్ బ్లాస్ట్ లతో, అరుపులతో హంగామా చేసారు ఫ్యాన్స్. అనంతరం కొద్ది సేపు మాట్లాడిన మీనూ ఆ తర్వాత బర్త్ డే కేక్ కట్ చేసింది. ఆ సమయంలో అరుపులు, కేకలతో హోరెత్తించారు అభిమానులు. అంత మంది ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు మీనాక్షి కూడా ఎమోషనల్ అయ్యింది. అందరికీ ధన్యవాదాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మీనాక్షికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక డెంటిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఫెమినా మిస్ ఇండియా గా విజయం సాధించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. మొదట ఓ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాటూలు వేయించుకుంటున్నారా.? యమ డేంజర్
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
