పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కన్నడ నటుల హవానే నడిచింది. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే గౌతమ్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మీ కూడా ఒకరు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.
అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌లో ఈవిడ కూడా ఒకరు. యష్మీ వారానికి సుమారు రెండున్నర లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇదిలా ఉంటే యష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో యష్మీ పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని, మంగళ స్నానం చేస్తూ కనిపించి షాకిచ్చింది. దీంతో నెటిజన్లు అదేంటి? యష్మీ ఇంత సడెన్ గా పెళ్లి చేసుకుంటోంది? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది రియల్ పెళ్లి కాదని రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్‌లోని సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి చౌదరి
టాటూలు వేయించుకుంటున్నారా.? యమ డేంజర్
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

