టాటూలు వేయించుకుంటున్నారా.? యమ డేంజర్
టాటూలు వేయించుకునేవారికి షాకింగ్ న్యూస్.. సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరూ టాటూస్ వేయించుకోవడం ఈ మధ్య ట్రెండింగ్‌గా మారింది. దీంతో గల్లీకొక టాటూ షాపులు పుట్టుకొస్తున్నాయి.. ఒకప్పుడు జాతర్లలో టాటూలు వేయించుకునేవారు. కానీ కాలానికి అనుగుణంగా ఇప్పుడు విపరీతంగా టాటూ షాపులు నెలకొన్నాయి..
ఇకపోతే ఈ టాటూల పిచ్చితో ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద టాటూలను వేయించుకుంటున్నారు యూత్. అయితే ఈ టాటూలకి ఉపయోగించే సిరా ప్రమాదాల బారిన పడేలా చేస్తోంది. టాటూలతో హెచ్ఐవి, క్యాన్సర్ ముప్పు ఉందని నియంత్రణకు కొత్త నిబంధనలు తేవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రానికి ఓ లేఖను రాశారు.. టాటూకు ఉపయోగించే సిరా దృశ్య ప్రభావం చూపుతోందని టాటూ పార్లర్లను నియంత్రించే చట్టం రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇటీవల కాలంలో చర్మ క్యాన్సర్, హెచ్ఐవి హైపర్టిస్ వంటి ప్రాణాంతకరమైనటువంటి జబ్బులు పెరుగుతున్నాయని వీటికి పచ్చబొట్లు వేసుకోవడం కూడా ఒక కారణమని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి టాటూ పార్లర్లు వెలుస్తున్నాయి.. సినిమా హీరోల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ టాటూలకు బానిసలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో టాటూలు వేయించుకునేటటువంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
