కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత శరీరంలో అదనపు పొటాషియం కూడా మంచిది కాదు.. కాబట్టి, పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలని వైద్యులు చెబుతున్నారు. అధిక పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలి.
ఎందుకు ఇలాంటి వారిలో తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది రక్తంలో అధిక స్థాయి పొటాషియం కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అలాగే, డయాబెటిస్‌లో కూడా కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చు. అందుకే మధుమేహం రోగులు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు.. తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్ళు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది తలతిరగడం, అలసట, మూర్ఛ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకండి. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Betel Leaf: తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు
తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం.. కారణం ఇదే
వీడిన బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపుల దగ్గర భారీగా క్యూ
తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు
ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
