హోలీ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..?
హిందువుల విశ్వాసం ప్రకారం చంద్ర గ్రహణానికి కూడా పట్టింపు ఎక్కువగానే ఉంటుంది. నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. చంద్రునికి , సూర్యుడుకి మధ్య భూమి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. అంటే చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు..సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్న వారికి చంద్రుడు కనిపించడు.
కనుక దీనిని చంద్ర గ్రహణం అని అంటారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోళీ రోజు ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణం ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025లో తొలిసారి మార్చి14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై, ఉదయం 11 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:29 వరకు ఈ గ్రహణం ఉంటుంది. అయితే చాలా మందిలో హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో ఫెస్టివల్ జరుపుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, భారత దేశంపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండదంటున్నారు పండితులు. గ్రహణం పగటి సమయంలో ఏర్పడుతుండటంతో, దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదంటున్నారు. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుంది. కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చని సూచిస్తున్నారు. అంతే కాకుండా గ్రహణం ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి వారైనా సరే.. వారిపై ఎలాంటి ప్రభావం ఉండని కొందరు పండితులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Betel Leaf: తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు
తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం.. కారణం ఇదే
వీడిన బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపుల దగ్గర భారీగా క్యూ
తాడేపల్లిలో వింత జంతువు ప్రత్యక్షం.. దాన్ని చూసి భయపడిన స్థానికులు
ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
