ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?
హనుమాన్ తర్వాత జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కాంతార సినిమాతో పాన్ ఇండియా నటుడిగా మారిపోయిన రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో కూడా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కి కొత్త కథ చెప్పిన ప్రశాంత్ వర్మ ముందుగానే ఈ సినిమానే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి చెప్పిన కథకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది, వర్మ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా ప్రారంభమైతే, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని టాక్. రిషబ్ శెట్టి ‘కాంతార, చాప్టర్ 1’ ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుంది. ఆ తర్వాత, అతను 2027లో ‘ఛత్రపతి శివాజీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్
హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
