హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్ సిస్టం స్టార్ట్ చేసింది. ఇకపై సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే వెసులుబాటు కల్పించింది. డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ తీసుకుని ప్రయాణం చేసే వీలు కల్పిస్తోంది. దీంతో గతంలో కండక్టర్లకు ఇబ్బందిగా మారిన చిల్లర సమస్యలకు స్వస్తి పలికింది ఆర్టీసీ యాజమాన్యం.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ప్రయాణికులకు, కండక్టర్‌కు మధ్య నిత్యం జరిగే చిల్లర పంచాయితీలు ఇకపై ఉండవని అంతా ఆశిస్తున్నారు. అయితే.. ఇప్పటి నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. యూపీఐ ద్వారా పేమెంట్ చేసి టికెట్ తీసుకునే వెసులుబాటును టీజీఎస్ ఆర్టీసీ కల్పించనుంది. టీజీఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు, కండక్టర్ల వర్షన్ ఎలా ఉందో మా కరస్పాండెంట్ శ్రీధర్ మరింత సమచారం అందిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…
అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి చౌదరి
టాటూలు వేయించుకుంటున్నారా.? యమ డేంజర్
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
