ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం
విశ్వాసంలో శునకానికి సాటి మరొకటి ఉండదు. పట్టెడన్నం పెడితే చాలు.. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన విశ్వాసాన్ని చాటుకుంటుంది. తన యజమానికి, అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. అందుకే ఎక్కువమంది శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. పెంపుడు కుక్కలను చాలామంది తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావిస్తారు. ఎంతో ప్రేమ చూపిస్తారు.
అందుకు ప్రతిగా ఆ శునకం కూడా వారిపట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటుంది. తన యజమాని రాకోసం గుమ్మం ముందుకూర్చుని ఆర్తిగా ఎదురు చూస్తుంది. తన యజమానిని చూడగానే ఆనందంతో ఎదురు వెళ్లి ఆహ్వానిస్తుంది. అలాంటి ఓ శునకం ఏకంగా పులితో పోరాడి, తన యజమాని ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వు పార్కు పక్కనే ఉన్న భార్హుట్ గ్రామంలో ఒక పెంపుడుకుక్క తన యజమానిపై చూపించిన విధేయత చర్చనీయాంశంగా మారింది. శివమ్ అనే రైతు రాత్రివేళ పొలానికి కాపలాగా వెళ్తున్నాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా పొలానికి బయలుదేరాడు. శివమ్‌కి తోడుగా అతని పెండుపు శునకం వెళ్లింది. ఈ క్రమంలో పొలానికి కాపలాగా ఉన్న శివమ్‌పై అకస్మాత్తుగా పులి దాడి చేయబోయింది. అది గమనించిన జర్మన్ షెపర్డ్ జాతి పెంపుడుకుక్క వెంటనే పులిపై ఎటాక్ చేసింది. రెండింటి మధ్య చాలా సమయం భీకరమైన పోరాటం జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్
అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్
హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
