ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్
ఇప్పుడంతా డిజిటల్ యుగం. టెక్నాలజీ పుణ్యమా అని కూర్చున్న చోటు నుంచే అన్ని పనులు చక్కబెట్టే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటిలో కూర్చునే ఆన్‌లైన్‌లో అన్ని పనులు చకచకా అయిపోతున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు వాహనాలు రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా చేరబోతున్నాయి.
రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి తొలి వారం నుంచి ఆన్‌లైన్‌లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తొలి విడతలో ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో విస్తరించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావడంతో తెలంగాణలో ఈ ఆన్‌లైన్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ 2016లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను రూపొందించింది. ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాఫీగా సాగనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్
హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్
పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
