కొంపముంచిన ఛాయ్.. టీ తాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ
పొట్టకూటి కోసం పాండిచేరికి వెళ్లాలని తమవారితో కలిసి ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి , మరో ప్రాంతంలో 20 ఏళ్లుగా కూలి లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని కార్మిక శాఖ అధికారులు ఇటీవల వ్యాపారసంస్థలపై నిర్వహించిన దాడుల్లో అప్పారావును చూసి షాక్ అయ్యారు.
20 ఏళ్లుగా వెట్టిచాకిరీలో మగ్గుతున్నాడని గుర్తించారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఆదివాసి తెగకు చెందిన అప్పారావు 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైలులో పాండిచ్చేరి బయలుదేరాడు. అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గమధ్యలో ఒక స్టేషన్‌లో ఆగింది. అప్పారావు టీ తాగేందుకు ట్రైన్ నుండి కిందకు దిగాడు. టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ త్రాగి తిరిగి స్టేషన్ కు వచ్చి చూసేసరికి ట్రైన్ కనిపించలేదు. అధికారులను అడగ్గా ట్రైన్ వెళ్లిపోయిందని సమాధానం వచ్చింది. అయితే అప్పారావు వద్ద డబ్బులు లేకపోవడంతో ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు. రెండు రోజులు అటూ ఇటూ తిరిగి ఏం చేయాలో పాలుపోక తినటానికి తిండి కోసం తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపలాదారుడిగా పనిలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయిన అప్పారావుకు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు యజమాని. అప్పారావు బయటికి వెళితే తిరిగి రాడేమోననే ఉద్దేశ్యంతో ఆ ప్రదేశం నుండి బయటకు కూడా వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం
ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్
అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

