7 నెలల క్రితం ప్రేమ పెళ్లి..కానీ ఇంతలోనే..వీడియో
హైదరాబాద్ రాయదుర్గంలో కట్నం వేధింపులకు బలైపోయింది నవ వధువు. భర్త, అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది దేవిక. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, పెళ్లయిన 2 నెలలకే వేధించడం మొదలుపెట్టాడు. మొదట.. నువ్వుంటే చాలన్నవాడే.. ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్ స్టార్ట్ చేశాడు. దాంతో, కూతురి కోసం.. అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చింది తల్లి.
ఐదు లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం ముట్టజెప్పింది. అయినా, అతని.. కట్నదాహం తీరలేదు. ఇంకా ఇంకా డబ్బు తీసుకురావాలని వేధించాడు. ఫలితం.. ఆమె బలవన్మరణం. ఎంబీఏ పూర్తిచేసిన దేవిక.. హైదరాబాద్‌లోనే ప్రైవేట్ ఉద్యోగం చేసింది. 7 నెలల క్రితం పరిచయమైన శరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో అంతే గ్రాండ్‌గా రిసెప్షన్‌ని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయ్. గొడవలు మొదలయ్యాయ్. ఈ గొడవలకు అదనపు కట్నమే కారణమంటోంది దేవిక తల్లి రామలక్. ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది దేవిక. దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. అదనపు కట్నం కోసం తన కూతురిని ఆమె భర్త శరత్ వేధించేవాడని చెబుతోంది దేవిక తల్లి. తన కూతురు దేవికను అల్లుడు శరత్ చంపేశాడని ఆరోపిస్తోంది. దేవికను కొట్టిచంపేసి.. ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటోంది తల్లి రామలక్ష్మి.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో
వేసవిలో ఈ కూరగాయ తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు వీడియో
పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ ఏంచేసిందంటే!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
