Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చట్టసభలో ఇదేం పని ఎమ్మెల్యే గారూ వీడియో

చట్టసభలో ఇదేం పని ఎమ్మెల్యే గారూ వీడియో

Samatha J

|

Updated on: Mar 09, 2025 | 3:08 PM

తంబాకు కారణంగా నోటి క్యాన్సర్ వచ్చింది. నా వైద్యం కోసం మా అమ్మ తన రెండు చేతి గాజులు అమ్మేసింది.. ఈ డైలాగ్‌ అందరికీ సుపరిచితమే. థియేటర్ లో ఏ భాషా చిత్రం ఆడుతున్నా.. అందులో ఈ ప్రకటనను ప్రదర్శిస్తూ ఉంటారు. టీవీలో కూడా వేస్తుంటారు. గుట్కా, పాన్ పరాగ్ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రాణాంతకమో చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఈ యాడ్స్‌ ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సరే, దేశంలో గుట్కా, తంబాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం అమలు చేస్తున్నా సరే.. వాటి వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా యూపీ అసెంబ్లీ జరిగిన ఘటనే సంచలనంగా మారింది.

 నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినవారే గుట్కాలు, పాన్ మసాలాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఈ గుట్కా ఉమ్ములతో ఏర్పడ్డ మరకలే దర్శనమిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే పవిత్ర స్థలాలులోనూ తుఫుక్.. తుఫుక్ అంటూ ఉమ్మేస్తుంటారు. అందమైన పరిసరాలను పాన్ మరకలతో అపరిశుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీని సైతం వదలకుండా గుట్కా నమిలి ఉమ్మేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చ్‌ 4న ఓ దృశ్యం అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానాకు ఆగ్రహం, అసహనం తెప్పించింది. ఆయన సభకు హాజరయ్యేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో అసెంబ్లీ లోపల కార్పెట్ మీద గుట్కా నమిలి ఉమ్మిన మరకలను గుర్తించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయించారు. సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ఈ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఇదొక క్రమశిక్షణారాహిత్యమైన చర్య అని మండిపడ్డారు. మిగతా వారు ఇలాంటి చెత్త పనులకు పాల్పడవద్దంటూ హితవు పలికారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో

ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్‌ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో

చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో