డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో
మద్యం మత్తులో తనను దూషించిన డ్రైవర్‌కు అసోం మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ డ్రైవర్ మద్యం మత్తులో తనను అనరాని మాటలు అన్నాడని ఆరోపిస్తూ.. అసోం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమె అతడిని కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఆ డ్రైవర్ తమవద్ద చాలాకాలంగా పని చేస్తున్నాడని అన్నారు. అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి తనను తిడుతూ వేధిస్తుంటాడని అన్నారు. అతడికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తాడని తాము ఓపికతో ఉంటామని.. అలా ప్రవర్తించవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. సోమవారం తను ఇంట్లో ఉండగా తలుపును గట్టిగా బాదుతూ.. బయటకు రావాలని దూషించాడని తెలిపారు. అందువల్లే అతడికి తగిన బుద్ధి చెప్పానని అన్నారు. అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగినా లేదా వ్యక్తిగతంగా ఏర్పాటుచేసుకున్న వ్యక్తా అనే విషయంపై స్పష్టత లేదు. అసోం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాసం ఉండడానికి అనుమతి ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
