నకిలీ బిచ్చగాడు.. రూ.500లకు అడ్డంగా బుక్కయ్యాడు వీడియో
ఒక వ్యక్తి వికలాంగుడిలా నటిస్తూ భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతిఒక్కరూ షాక్ అవుతున్నారు. ఒక బాలుడు కర్రల సహాయంతో కారు వద్దకు చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని యాచించాడు. అతడి దీనస్థితిని చూసి.. కారు నడిపే వ్యక్తి కరిగిపోయాడు.. వెంటనే రూ. 500 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ, అంతకు ముందు అతను ఒక షరతు పెట్టాడు. అది విని భిక్షాటన చేస్తున్న బాలుడు సిగ్గుపడ్డాడు. కానీ కొంత సమయం తర్వాత అతను ఆ షరతుకు అంగీకరించాడు.
వెంటనే అతడు రెండు కాళ్లతో పరిగెత్తడం ప్రారంభించాడు. కారులో ఉన్న వ్యక్తి ఆ భిక్షాటన చేసుకుంటున్న వికలాంగుడికి ఇదే షరతు పెట్టాడు. కర్రల సాయం లేకుండా రెండు కాళ్లపై పరిగెత్తాలని చెప్పాడు. ఇలా చేస్తే 500 రూపాయిలు ఇస్తానని చెప్పాడు. దాంతో డబ్బు వస్తుందన్న ఆశతో ఆ వ్యక్తి వెంటనే యాక్టివ్ అయ్యాడు. తన ఊతకర్రలను పక్కన పెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు. అది గమనించిన కారు డ్రైవర్.. అతన్ని నిలదీశాడు..ఇలా ఎందుకు అడుక్కుంటున్నావని అడుగగా, తానే కాదు, తన చెల్లి కూడా వికలాంగులులా నటిస్తూ ఇలా బిచ్చమెత్తుకుంటున్నామని చెప్పాడు. అతడు చెప్పిన మాటలన్నీ విన్న ఆ కారు డ్రైవర్ ఆ అబ్బాయికి పని ఇప్పిస్తానన్నాడు. కానీ దీనికి ఆ బాలుడు అంగీకరించలేదు.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో
వేసవిలో ఈ కూరగాయ తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు వీడియో
పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ ఏంచేసిందంటే!

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
