ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. పొరుగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సప్‌లో పంపిన మెసేజ్ వారిద్దరి హత్యకు దారి తీసింది. తన భార్యకు వాట్సప్‌లో ముద్దు ఎమోజీ పంపాడన్న కోపంతో సతీమణీతో పాటు ఆమె స్నేహితుడినీ కొడవలితో నరికి చంపాడో వ్యక్తి. కేరళలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పథనంథిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తున్నాడు. వారికి పది, ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ల ఇంటి పక్కనే విష్ణు అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు. విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సప్‌కు ముద్దు ఎమోజీని పంపాడు. అది చూసిన బైజు తన భార్యతో రాత్రి గొడవకు దిగాడు. ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది. అయితే కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు.. భార్యను పెరట్లోకి లాక్కెళ్లి నరికాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణుపైనా దాడి చేశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే వారిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు. స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం
పెళ్లయిన నెలరోజులకే భర్తపై విషప్రయోగం..చివరికి వీడియో
జనావాసాల్లోకి వస్తోన్న వింత జంతువులు వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
