నేలపై ఉన్నప్పుడు కనపడదు..నీటిలో దిగగానే చూపు వస్తుంది.. వీడియో
ప్రస్తుత కాలంలో దివ్యాంగులు సైతం అన్ని రంగాలలో తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు పుట్టుకతో దివ్యాంగులైనవారు తమ జీవితం ఇంతేనని, తామేమీ చేయలేమని ఒక నిస్సహాయ జీవనాన్ని గడిపేవారు. ప్రస్తుతం కాలం మారింది. పుట్టుకతోనో, ప్రమాదవశాత్తో మానసికంగా, శారీరకంగా దివ్యాంగులైనవారు విద్య, ఉద్యోగం, కళారంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారు. సామాన్య మానవులకు తాము ఏమాత్రం తీసిపోమని రుజువు చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ అంధుడు ఏకంగా 14 ప్రాణాలను కాపాడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నాడు
బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా దుమ్‌దుమా గ్రామానికి చెంది భుల్లు పుట్టుకతోనే అంధుడు. అయితే విచిత్రంగా భుల్లు నీటిలో దిగగానే అతనికి దృష్టి వస్తుంది. చక్కగా చూడగలుగుతాడు. ఈ ప్రత్యేకతతో భుల్లు బాయా నది, ఇంకా ఇతర నీటి మడుగుల్లో మునిగిపోయిన 14 మందిని ప్రాణాలతో కాపాడాడు. అలాగే 13 మృతదేహాలను సైతం వెలికి తీశాడు. అతడి ప్రతిభను గుర్తించి.. బిహార్ పోలీస్ వారోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రశంసాపత్రం, రూ.10 వేల నగదును అందజేశారు. నేలపై ఉన్నపుడు ఏదీ చూడలేనని, నీటిలోకి దిగితే మాత్రం తన కళ్లు మెరుస్తాయని, అన్నీ స్పష్టంగా కనిపిస్తాయని చెబుతాడు. భుల్లు నీటిలో దిగినప్పుడు చూడగలగడంపై కంటి వైద్య నిపుణులు డాక్టర్ లాల్‌బాబుషా క్లారిటీ ఇచ్చారు. గాలి, నీటి వక్రీభవన గుణకాలు (Refractive indices ) భిన్నంగా ఉండటమే దీనికి కారణమై ఉంటుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో
ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో
చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
