ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఇంట్లో వాడే వస్తువుల నుంచి హోటల్స్‌లో మనం తినే పేపర్ ప్లేట్స్ వరకు అంతా యమ డేంజర్‌గా మారింది. ఇదే ఇప్పుడు కేన్సర్‌కు కారణం అవుతోంది. బెంగుళూరులోని ఇడ్లీల్లో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయటం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరులో ఇడ్లీ వాయ వేసేటప్పుడు వస్త్రంతో కాకుండా ప్లాస్టిక్ కవర్‌లో ఇడ్లీలను వేస్తున్నారు.
ఇడ్లీలు పార్సిల్ కట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లలోనే చుట్టేస్తున్నారు. దీంతో ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి, దాని అవశేషాలు ఇడ్లీల్లోకి చేరిపోతున్నాయి. దీంతో ఇడ్లీల్లో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇది వెలుగులోకి రావడంతో..ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీలు వేయడాన్ని బ్యాన్ చేస్తూ కర్నాటక సర్కార్ చర్యలు తీసుకుంది. ప్లాస్టిక్‌లో ఉండే కార్సోజెనిక్ రసాయనం మనకు తెలియకుండానే ఇడ్లీల ద్వారా మన కడుపులోకి వెళుతుంది. కార్సోజెనిక్ కేన్సర్ కారకం అని, అది ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సో. ఇడ్లీలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయ్యేకొద్దీ, మనకు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయంటున్నారు వైద్యులు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో
ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో
చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
