కోపం ఎక్కువగా వస్తుందా.? ఈ విటమిన్ల లోపం కావచ్చు.. 

01 December 2024

TV9 Telugu

కొన్ని రకాల విటమిన్ల లోపం కారణంగా మనిషికి ఊరికే కోపం వస్తుంది. విటమిన్‌ బీ6 లోపం ఉంటే మనిషి తరచూ కోపానికి గురవుతాడు.

మెదడు పనితీరు సరిగ్గా ఉండాలంటే ఆహారంలో విటమిన్‌ బీ6 ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక కోపం ఎక్కువగా రావడానికి మరో ప్రధాన కారణం విటమిన్‌ బీ12 లోపం. బీ12 లోపం లోపం కారణంగా నిత్యం అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌ బీ12 లోపం కారణంగా శరీరం డిప్రెషన్‌కు కూడా గురవుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి సరిపడ జింక్‌ లభించకపోయినా మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. మానసిక కల్లోలం, ఆందోళన, చిరాకు, డిప్రెషన్‌ వంటివి వేధిస్తాయి.

మెగ్నిషియం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నిత్యం మానసిక ఒత్తిడతో బాధపడేవారు వారు ఆహారంలో కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలి.

ఆహారంలో విటమిన్‌ బీ6, విటమిన్‌ బీ12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పచ్చి ఆకు కూరలు, అవకాడోతో పాటు మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే జింక్‌, మెగ్నీషియం ఎక్కువగా ఉండే చేపలు, బ్రోకలీ, మొలకలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసకోవాలి.