వెన్ను నొప్పి వేధిస్తోందా.? ఈ పొరపాట్లే కారణం..

TV9 Telugu

26 November 2024

ఇలాంటి  పొరపాట్లు కారణంగా సయాటికా, ఆస్టియో ఆర్థరైటిస్‌ లాంటి తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదమూ పొంచి ఉంది.

వెన్నును ఎల్లప్పుడు నిటారుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. లేకపోతే తీవ్రమైన వెన్నునొప్పికి దారి తీయవచ్చు.

ఎక్కువ సమయం మెడను వంచి మొబైల్‌ ఫోన్‌‎ను చూడటం కారణంగా వెన్నెముకలోని డిస్కుల మధ్య రాపిడి పెరుగుతుంది.

స్క్రీన్‌ టైమ్‌ తగ్గించడంతో పాటు చూసిన కొద్దిసేపైనా నిటారుగా చూడటం అలవాటు చేసుకోవాలని అంటున్నారు వైద్యులు.

హై హీల్స్‌ ధరించడం వల్ల వెన్ను ఆకృతి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. అందుకే ఫ్లాట్‌ సోల్‌ ఉన్న చెప్పులు ఉత్తమం.

ఎప్పుడైనా బరువులు మోసేటప్పుడు భుజాలు, చేతులు, కాళ్ల మీద భారం పడేలా చూసుకుంటే వెన్ను బలహీనపడుకుండా ఉంటుంది.

మీరు డెస్క్‌ ముందు కూర్చుని పనిచేసేటప్పుడు కుర్చీ, బల్ల సరైన ఎత్తులో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి.

విటమిన్‌-డి లోపం, కొన్ని రకాల మందుల ప్రభావం కూడా వెన్నెముకపై పడుతుంది. మనం చేస్తున్న పొరపాట్లను తప్పక గమనిస్తూ వైద్యులను సంప్రదించడం మరిచిపోకూడదు.