Tollywood: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బాక్సాఫీస్ సెన్సెషన్.. రికార్డ్స్‌తో సత్తా చాటుతోన్న హీరో..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ హీరో పేరు మారుమోగుతుంది. హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్టును గుర్తుపట్టారా.. ?
సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో కమల్ హాసన్. విశ్వనాయకుడి గురించి జనాలకు గురించి ఎంత చెప్పిన తక్కువే. తన అద్భుతమైన నటనతో లోకనాయకుడిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోయిజం సినిమాలు కాదు.. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అప్పటికీ.. ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు కమల్ హాసన్. కమల్ హాసన్ నటించిన అద్భుతమైన చిత్రాల్లో స్వాతిముత్యం ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాకు సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉంది. కళాతపస్వీ కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో కమల్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అమాయకమైన వ్యక్తి పాత్రలో జీవించేశాడు.
ఇందులో కమల్ జోడిగా హీరోయిన్ రాధికా శరత్ కుమార్ నటించింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇందులో కమల్ హాసన్ మనవడిగా నటించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్. పైన ఫోటోలో కనిపించిన కుర్రాడిని గుర్తుపట్టరా.? అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న స్టార్. ఆ చిన్నోడు మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్ నటించిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు.
ఈ చిత్రంలో బన్నీ కనిపించింది కొద్దిసేపు అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 క్రేజ్ మారుమోగుతుంది.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.