Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాః కేటీఆర్

కేటీఆర్‌‌పై ఫార్ములా ఈ రేస్‌ కేసు ఆరోపణల నేపథ్యంలో ఓ వైపు లీగల్‌ ఫైట్‌.. మరోవైపు పొలిటికల్‌ పోరాటం. ఈ రెండూ సమాంతరంగా సాగాలని భావిస్తోంది బీఆర్ఎస్. కేసులపై న్యాయపరంగా పోరాడాలని భావిస్తున్న కేటీఆర్.. అదే సమయంలో బీఆర్ఎస్‌ రాజకీయ పోరాటాలు కూడా అదే స్థాయిలో కొనసాగాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు.

ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాః కేటీఆర్
Ktr Acb Inquiry
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 09, 2025 | 5:37 PM

ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా పోరాటం ఆగదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. అవగాహన మేరకు అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని వెల్లడించారు

ఎట్టకేలకు కేటీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విచారణ జరిపింది. సుమారు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. రెండు భాగాలుగా కొనసాగిన కేటీఆర్‌ ఎంక్వైరీ.. ఫార్ములా ఈ రేస్‌కి ముందు జరిగిన అగ్రిమెంట్లు.. రేస్‌ తర్వాత ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ విచారణ జరిపినట్లు సమాచారం. ఇక అప్పటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌పై ఏసీబీ అధికారులు ఆరాతీసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. అయితే కేటీఆర్‌ పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కేటీఆర్‌ లాయర్ కోరగా.. జనవరి 15న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో