HMPV వైరస్
ఐదేళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతోంది.. కరోనా కేసులు.. మాస్కులు.. భౌతికదూరాలు.. అన్నిటికీ మించి భయాలు మళ్లీ వెంటాడుతున్నాయి. – ప్రాణాంతక కరోనా వైరస్‌కు పురిటిగడ్డ అయిన చైనా నుంచే ఇప్పుడు HMPV కూడా అక్కడినుంచే వచ్చింది. చైనాలో వేగంగా విస్తరిస్తున్న HMPV వైరస్.. ఇప్పుడు భారత్‌కి వ్యాపించింది. జనవరి 6, 2025 ఒక రోజే బెంగుళూరు, గుజరాత్‌లో తొలి కేసులు నమోదయ్యాయి. చైనాలో వైరస్ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది. వైరస్ పరిణామాలను నిశితంగా పరిశీలించాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కి ఆదేశించింది. చైనా వైరస్ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.