ఆ రాష్ట్రంలో తొలి HMPV వైరస్.. మూడేళ్ల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) తొలి కేసు చత్తీస్ గఢ్ లోనూ నమోదైంది. మూడేళ్ల చిన్నారికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఇంట్లోను మరో మూగ్గురు చిన్నారులను కూడా వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు..

కోర్బా, ఫిబ్రవరి 3: ఛత్తీస్‌గఢ్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) తొలి కేసు నమోదైంది. రాష్ట్రంలోని కోర్బా జిల్లాకు చెందిన మూడేళ్ల చిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ నిర్ధారనైంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం బిలాస్‌పూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని జనవరి 27న బిలాస్‌పూర్‌కు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కానీ ఇక్కడ చికిత్స చేసినప్పటికీ, చిన్నారి ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ అయినట్లు ధృవీకరించింది.
అనంతరం చిన్నారిని ఆస్పత్రిలోని ఇతర రోగులకు దూరంగా ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచినట్లు సీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్ తివారీ శుక్రవారం (జనవరి 31) మీడియాకు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో రాయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మరోవైపు చిన్నారి ఇంట్లోని మరో ముగ్గురు సోదరులను కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించనప్పటికీ, వీరిని పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. మరోవైపు మొదటి HMPV కేసు రాష్ట్రంలో నమోదు కావడంతో బిలాస్‌పూర్ జిల్లాలో వైద్యా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ కొత్త వైరస్ ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఛత్తీస్‌గఢ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జనవరి 8న పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో సంబంధం ఉన్న ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ సూచనలు జారీ చేశారు. హెచ్‌ఎంపీవీ అనేది శ్వాసకోశ వైరస్. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్‌లోనూ మరోకేసు.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇదే!
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో మరో హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ కేసు నిర్ధారనైంది. నాలుగేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రంలోని మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ కేసు సంఖ్య 8కి పెరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాలుడు జ్వరం, దగ్గుతో జనవరి 28వ తేదీన ఎస్‌జీవీపీ ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు బాలుడికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ టెస్ట్ చేశారు. వీరి పరీక్షలో బాలుడికి హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ నిర్ధారనైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.