HMPV Cases: వామ్మో.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌! కొత్తగా మరో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ

HMPV Cases in India: దేశంలో కొత్త వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా మరో ఇద్దరు చిన్నారులకు HMPV వ్యాధి నిర్ధారనైంది. ఇద్దరు చిన్నారుల వయసు వరుసగా 7, 14 ఏళ్లు మాత్రమే. శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసే ఈ వ్యాధి లక్షణాలు కోవిడ్ వ్యాధిని పోలి ఉన్నాయి. జ్వరం, ముక్కు కారడం, జలుబు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వ్యక్తిగత శుభ్రతతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంక్రమనకు దూరంగా ఉండవచ్చు..

HMPV Cases: వామ్మో.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌! కొత్తగా మరో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ
Hmpv Cases
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 07, 2025 | 11:04 AM

నాగ్‌పూర్‌, జనవరి 7: దేశంలోకి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) పాజిటివ్‌ వచ్చింది. దీంతో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరింది. తాజాగా HMPV పాజిటివ్‌ నిర్ధారనైన ఇద్దరు చిన్నారులకు జనవరి 3న జ్వరం, దగ్గు వచ్చింది. దీంతో నాగ్‌పూర్‌లోని రాందాస్‌పేట్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు HMPV పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇద్దరు చిన్నారులకు HMPV సోకినట్లు నిర్ధారనైంది. కాగా HMPV వైరస్‌ కూడా కోవిడ్ -19 మాదిరిగానే శ్వాసకోస వ్యవస్థపై దాడి చేసే అంటువ్యాధి. ఈ వ్యాధి బారీన పడిన వారిలో జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దగ్గు, జ్వరం వంటి ఏదైనా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (SARI)తో బాధపడుతున్న వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వైరస్ నివారణ, చర్యలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తామని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.