Black Tea Vs Black Coffee: బ్లాక్ టీ.. బ్లాక్ కాఫీ.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా? అందరూ చేసే పొరబాటు ఇదే
టీ, కాఫీ రెండూ రుచికి బలేగా ఉంటాయి. అందుకే చాలా మంది కప్పులు కప్పులు లాగించేస్తుంటారు. అయితే కొందరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలను ఇష్టపడుతుంటారు. సాధారణ టీ, కాఫీల కంటే బ్లాక్ టీ, కాఫీలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తిన్పుడు మాత్రం.. కొంత చర్చ సాగాల్సిందే..
చలిలో కప్పు కాఫీ తాగితే అంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి తెలిసిందే. కానీ కాఫీ, టీలు తయారు చేసే డికాషన్‌కి చాలా తేడా ఉంటుంది. మీలో చాలా మందికి బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీని రెగ్యులర్ గా తాగే అలవాటు ఉండవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి తెలియదు. ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
తక్షణ శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు 95 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే కప్పు బ్లాక్ టీలో 26-48 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట లేదా పని సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలనుకునే వారికి కాఫీ మంచి ఎంపిక.
కాఫీలో చక్కెర, పాలు జోడించకుండా వినియోగించినప్పుడు కేలరీల రహిత పానీయం తయారవుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం. కానీ ఈ టీలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది చక్కెర, పాలు లేదా తేనె టీ తాగేందుకు అధికంగా ఆసక్తి చూపుతారు. ఇది త్వరగా కేలరీల పానీయంగా మారుతుంది. కానీ నిజానికి బ్లాక్ కాఫీ వినియోగం జీవక్రియను మెరుగుపరుస్తుంది.
బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఈ బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ కాఫీలోని పాలీఫెనాల్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం బ్లాక్ కాఫీలో ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బ్లాక్ టీలో ఈ సామర్థ్యం ఉన్నప్పటికీ, దానిలో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బ్లాక్ కాఫీతో పోలిస్తే ఇది తక్షణ ప్రభావాన్ని కలిగి ఉండదు. బ్లాక్ కాఫీ ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రింక్ కూడా. ఇది శారీరక పనితీరును ప్రోత్సహిస్తుంది. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించి శారీరక శ్రమకు కావల్సిన శక్తిగా మార్చే ఆడ్రినలిన్ స్థాయి పెరుగుతుంది.