మటన్ మిరియాల చారు ఇలా చేస్తే.. జలుబు, దగ్గు దెబ్బకు పరార్

Prasanna Yadla

26 February 2026

Pic credit - Pixabay

మటన్ తో ఏ వంటకం చేసినా కూడా రుచి అదిరిపోతోంది. అన్నింటి కంటే మటన్ మిరియాల చారు మన ఆరోగ్యానికి చాలా మంచిది

మటన్ మిరియాల చారు 

మటన్ మిరియాల చారు చేయడానికి కావల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఎలా తయారు చేయాలంటే..

మటన్ బోన్స్, కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు, 3 టమోటాలు, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నల్ల మిరియాల పొడి, కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు

ముందుగా మటన్ తీసుకుని చిన్న ముక్కలుగా చేసి వేడి నీటితో కడగాలి. ఆ తర్వాత వీటిని ప్రెజర్ కుక్కర్‌లో వేసి స్టవ్ మీద పెట్టాలి. 

స్టెప్ - 1

మధ్యలో మూత తీసి ఉల్లిపాయలు ముక్కలు, టమోటా ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు మిరియాల పొడి   కూడా  వేసి స్టవ్ మీదే మరగనివ్వాలి. 

స్టెప్ - 2

దానిలో నీళ్ళు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే పెట్టాలి. మటన్ ఉడికే వరకు స్టవ్ మీదే పెట్టాలి. 

స్టెప్ - 3

10 నిముషాలు ఆగిన తర్వాత మూత తీసి ఒకసారి టేస్ట్ చూడండి తక్కువగా అనిపిస్తే  వాటిని కలుపుకోండి.

స్టెప్ - 4

చివర్లో దించే ముందు కొత్తిమీర చల్లుకుని దించేయండి. అంతే వేడి వేడి మటన్ చారు రెడీ

స్టెప్ - 4