AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలను అలా పెంచితేనే ధైర్యంగా ఎదుగుతారు.. మాల్తీ విషయంలో ప్రియాంక చోప్రా తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే!

గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, హాలీవుడ్ వీధుల్లో బిజీగా ఉన్నా ఆ నటి మనసు మాత్రం ఎప్పుడూ తన కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా తన గారాల పట్టి మాల్తీ మారీ పుట్టిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. తాజాగా ఆమె నటించిన సినిమా ప్రమోషన్లలో భాగంగా తన పేరెంటింగ్ స్టైల్ గురించి, ఒక బలమైన అమ్మాయిని ఎలా పెంచాలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అమ్మాయిలను అలా పెంచితేనే ధైర్యంగా ఎదుగుతారు.. మాల్తీ విషయంలో ప్రియాంక చోప్రా తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే!
Priyanka Chopra With Malti
Nikhil
|

Updated on: Feb 26, 2026 | 8:47 PM

Share

ఆమె ఒకప్పుడు ప్రపంచ సుందరిగా కిరీటాన్ని గెలుచుకుంది.. ఇప్పుడు హాలీవుడ్‌ను శాసిస్తోంది. నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత 2022లో ఆమె జీవితంలోకి ఒక చిన్నారి దేవత ప్రవేశించింది. అప్పటి నుండి ఆమె ప్రపంచం మొత్తం ఆ పాప చుట్టూనే తిరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25, 2026న విడుదల కాబోతున్న తన కొత్త సినిమా ‘ద బ్లఫ్’ ప్రమోషన్లలో భాగంగా ఆమె తనలోని అమ్మతనాన్ని, తన పెంపకాన్ని బయటపెట్టింది. ఒక బలమైన దేశీ అమ్మాయిని ఎలా పెంచాలి? పిల్లలకు ఏది ఇస్తే వారు గొప్పగా ఎదుగుతారు? అనే విషయాలపై ఆ గ్లోబల్ స్టార్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా.

స్వేచ్ఛే నా బలం..

ఒక బలమైన అమ్మాయిని పెంచడం గురించి మాట్లాడుతూ ప్రియాంక తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. తన తండ్రి అశోక్ చోప్రా తన చిన్నతనంలోనే ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని చెప్పింది. తన తండ్రి తన స్నేహితులతో కలిసి కూర్చున్నప్పుడు కూడా, ఏదైనా విషయంపై తన అభిప్రాయం చెప్పాలనుకుంటే ఆయన తనకు అవకాశం ఇచ్చేవారని గుర్తుచేసుకుంది. “ఆయన నాకు నా సొంత వ్యక్తిత్వాన్ని చాటుకునేలా ఏజెన్సీని ఇచ్చారు. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అని ప్రియాంక వివరించింది.

పిల్లల మాట వినండి..

పిల్లలను పెంచడంలో నిక్ జోనాస్, తాను ఒకే పద్ధతిని పాటిస్తామని ప్రియాంక వెల్లడించింది. పిల్లలు చిన్నవారే కదా అని వారి మాటలను నిర్లక్ష్యం చేయకూడదని, వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినాలని ఆమె సూచించింది. పిల్లలు చెప్పేది ఎవరైనా వింటున్నారు అనే భావన వారిలో గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడింది. అలాగే పిల్లలు సమస్యలను వారే పరిష్కరించుకునేలా వారికి కొంత సమయం ఇవ్వడం వల్ల వారు మరింత బలంగా తయారవుతారని ఆమె కో-స్టార్ కార్ల్ అర్బన్ మాటలను సమర్థించింది.

‘ద బ్లఫ్’ సినిమాలో తన పాత్ర అయిన ‘ఎర్సెల్’ గురించి మాట్లాడుతూ.. ఆ పాత్రలో నటించడానికి తనలోని పేరెంటింగ్ ఇన్‌స్టింక్ట్స్ ఎంతో సహాయపడ్డాయని ప్రియాంక చెప్పింది. “నేను ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు కొత్తగా అమ్మను అయ్యాను. నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వారిని చీల్చి చెండాడతా అనే ఆ శక్తి, కోపం నా తల్లి మరియు అమ్మమ్మల నుండి నాకు వచ్చాయి” అని ఆమె తెలిపింది. ఒక తల్లిగా తన కుటుంబం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె పేర్కొంది. సాధారణంగా భారతీయ మహిళల్లో ఉండే ‘మదర్ గిల్ట్’ (తల్లిగా సరైన బాధ్యత నిర్వర్తించట్లేదేమో అనే బాధ) గురించి కూడా ప్రియాంక మాట్లాడింది.

“నేను సరిగ్గా కష్టపడట్లేదా? ఏదైనా మర్చిపోయానా? నా బిడ్డను సరిగ్గా చూసుకోవట్లేదా?” అని తనను తాను ప్రశ్నించుకునేదానినని, కానీ క్రమంగా ఆ ఆలోచనల నుండి బయటకు రావడం నేర్చుకుంటున్నానని చెప్పింది. మన ప్రయత్నం మనం గట్టిగా చేసినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయని ఆమె నమ్ముతోంది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా, తన కూతురు మాల్తీ మారీకి మంచి విలువలు నేర్పిస్తూ, ఒక ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రియాంక చోప్రా నిరూపిస్తోంది.

Follow Us