AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

తులసి మొక్క ప్రతి ఇంటికి ఒక ఆభరణం. కానీ వేసవి కాలం వస్తే చాలు.. ఎండ వేడికి తులసిమ్మ వాడిపోతుంటే మనసు భారంగా అనిపిస్తుంది. కొందరు ఎంత నీరు పోసినా మొక్క బ్రతకడం లేదని బాధపడుతుంటారు. అయితే నీరు పోయడమే కాదు.. తులసికి కావలసిన అసలైన పోషణ ఏంటి? ఈ మండుటెండల్లోనూ మొక్కను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
How To Save Tulsi Plant From Summer Heat
Krishna S
|

Updated on: Apr 06, 2026 | 2:43 PM

Share

భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా తులసి ఒక సంజీవని. అయితే వేసవిలో మండుతున్న ఎండలకు తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం లేదా ఎండిపోవడం మనం చూస్తుంటాం. మీ ఇంట్లోని తులసి కోట కూడా ఎండ దెబ్బకు కళ తప్పిందా? అయితే ఈ సింపుల్ గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే, మీ తులసి మొక్క మళ్లీ చిగురించి పచ్చగా మారుతుంది.

నీరు పెట్టడంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎండలు ఎక్కువగా ఉన్నాయని విపరీతంగా నీళ్లు పోయడం తులసికి చేటు చేస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే నీరు పెట్టాలి. దీనివల్ల మొక్క నీటిని బాగా గ్రహిస్తుంది. ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టిలో తేమ ఉండేలా చూస్తే సరిపోతుంది.

పోషణ కోసం సహజ సిద్ధమైన టానిక్

కెమికల్ ఎరువుల కంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే తులసికి ప్రాణం పోయవచ్చు. నెలకు ఒకటి లేదా రెండు సార్లు బియ్యం కడిగిన నీరు లేదా పలచటి మజ్జిగను మట్టిలో పోయండి. ఇది సహజ పోషకాలను అందించి మట్టిని సారవంతం చేస్తుంది. ఎండబెట్టిన అరటి తొక్కల పొడిని మట్టిలో కలిపితే మొక్క బలంగా పెరుగుతుంది.

సేంద్రియ ఎరువులు – కీటకాల నివారణ

తులసి ఆకులు పచ్చగా ఉండాలంటే ఆవు పేడ లేదా వర్మీకంపోస్ట్ అప్పుడప్పుడు వేయాలి. వేసవిలో చిన్న పురుగులు ఆకులను పాడు చేయకుండా ఉండటానికి.. వేప నూనె లేదా వేప నీటిని ఆకులపై పిచికారీ చేయండి.

మట్టిని వదులు చేయండి

మట్టి మరీ గట్టిగా ఉంటే వేర్లకు గాలి, నీరు అందవు. కాబట్టి అప్పుడప్పుడు కుండీలోని మట్టిని ఏదైనా చిన్న కర్రతో కదిలించి వదులుగా చేయాలి. ఇది వేర్లు బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

ఎండ నుంచి కాపాడే మరికొన్ని సీక్రెట్ టిప్స్

  • మధ్యాహ్నం వేళ తీవ్రమైన ఎండ తగలకుండా తులసి మొక్కను నీడ ఉన్న ప్రదేశానికి మార్చండి.
  • మట్టిపై ఎండు ఆకులు లేదా కొబ్బరి పీచును పరచండి. దీనివల్ల నీరు త్వరగా ఆవిరి కాకుండా మట్టిలో తేమ ఎక్కువ కాలం ఉంటుంది.
  • ఎండిన పువ్వులు, పసుపు ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తుంటే కొత్త చిగుర్లు వస్తాయి.

Follow Us
రైలు ప్రయాణికులకు అలర్ట్:లోయర్ బెర్త్ పొందే సింపుల్ సీక్రెట్ ఇదే!
రైలు ప్రయాణికులకు అలర్ట్:లోయర్ బెర్త్ పొందే సింపుల్ సీక్రెట్ ఇదే!
అన్నా ఇది నువ్వేనా? ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా?
అన్నా ఇది నువ్వేనా? ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా?
ఇన్ని ఏళ్ళు దాచిన నిజం చెప్పిన డిస్కో శాంతి..
ఇన్ని ఏళ్ళు దాచిన నిజం చెప్పిన డిస్కో శాంతి..
'ఆ ఇద్దరి వల్లే ఓడిపోతున్నాం.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి ఔట్'
'ఆ ఇద్దరి వల్లే ఓడిపోతున్నాం.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి ఔట్'
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..