AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ రోగాలను మీరు కొని తెచ్చుకున్నట్లే..

ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే మీ కొంప మునిగే అవకాశం ఉంది.. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అద్భుత ఫలం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారు. ఈ పండులో ఉన్న పోషకాలు ఏంటి? అసలు ఆపిల్ తిన్న తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ రోగాలను మీరు కొని తెచ్చుకున్నట్లే..
Is It Safe To Drink Water After Eating Apple
Krishna S
|

Updated on: Apr 07, 2026 | 7:32 AM

Share

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నది నానుడి. ఆపిల్ కేవలం ఒక పండు మాత్రమే కాదు.. అది ఒక అద్భుత ఔషధం. మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, విజ్ఞాన శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడానికి కూడా ఇదే కారణమైంది. అయితే ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆపిల్ పండును తినే విషయంలో మనం చేసే ఒక చిన్న తప్పు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

చాలా మంది ఆపిల్ తిన్న వెంటనే దాహంగా ఉందని నీళ్లు తాగుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగకపోవడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆపిల్ తిన్న తర్వాత కనీసం 30 నుండి 60 నిమిషాల వరకు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే కేవలం ఒక గుక్కెడు నీరు మాత్రమే తీసుకోవాలి.

క్రీస్తు పూర్వం నాటి ఆపిల్ చరిత్ర

ఆపిల్ పండు ఇప్పుడే పుట్టింది కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వృక్షశాస్త్రవేత్తల ప్రకారం.. ఆపిల్ మొట్టమొదట మధ్య ఆసియాలోని కజకిస్తాన్‌‌లో క్రీ.పూ. 10,000 ప్రాంతంలో కనిపించింది. ప్రాచీన భారతీయ వైద్య గ్రంథం చరక సంహితలో కూడా ఆపిల్ ప్రస్తావన ఉంది. మన పూర్వీకులు దీనిని శరీరాన్ని చల్లబరిచే పండుగా గుర్తించారు. సర్ ఐజాక్ న్యూటన్ తలపై ఆపిల్ పడటంతోనే ఆయన గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 రకాల ఆపిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్‌లో దాగున్న పోషకాల గని

ఒక సాధారణ పరిమాణంలో ఉండే ఆపిల్ మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో 52 కేలరీలు, 13.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 2.4 గ్రాములు ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ట్రిప్టోఫాన్ నిద్రలేమి, ఒళ్లు నొప్పులను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

గుండె ఆరోగ్యం: ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

జీర్ణశక్తి: మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

బరువు తగ్గడం: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Follow Us
పెరుగు vs మజ్జిగ..ఎండాకాలంలో ఏది తింటే మంచిది? నిపుణుల సూచన
పెరుగు vs మజ్జిగ..ఎండాకాలంలో ఏది తింటే మంచిది? నిపుణుల సూచన
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..