AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AATA Grand Finale: అట్టహాసంగా ‘ఆట’ గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్నమైన రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, ఇప్పుడు మరో సంచలన ముగింపు వేడుకకు సిద్ధమైంది. అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స్ రియాలిటీ షో జీ తెలుగు 'ఆట' గ్రాండ్ ఫినాలే ఈ వారాంతంలో అట్టహాసంగా జరగనుంది. మే 2, 3వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ వేడుక, బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

AATA Grand Finale: అట్టహాసంగా 'ఆట' గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
Aata Grand Finale
Basha Shek
|

Updated on: Apr 29, 2026 | 8:46 PM

Share

నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే మరింత అద్భుతంగా సాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ స్టార్ కపుల్ జీవిత – రాజశేఖర్ సందడి చేయనున్నారు. అలాగే మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఫైనలిస్టులను ఉత్సాహపరిచేందుకు అతిథిగా విచ్చేయనున్నారు. యాంకర్ సుధీర్ కామెడీ టైమింగ్, సమీరా భరద్వాజ్ సంగీత విభావరి ఈ ముగింపు వేడుకను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

ఈ రెండు రోజుల వేడుకలో అనేక ఆసక్తికరమైన మరియు భావోద్వేగపూరితమైన ఘట్టాలు చోటుచేసుకోబోతున్నాయి. నటుడు రాజశేఖర్, రాధిక శరత్ కుమార్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా రాజశేఖర్ ముద్దుపేరు ‘బన్ బాబు’ గురించి జరిగిన చర్చ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఐకానిక్ మేనరిజంతో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ అతిథులందరూ కలిసి చేసిన డాన్స్ స్టేజ్ మీద ప్రకంపనలు సృష్టిస్తుంది.

కేవలం వినోదమే కాకుండా, మనసును హత్తుకునే సందర్భాలు కూడా ఈ ఫినాలే ఎపిసోడ్లో అందరినీ ఆకట్టుకోనున్నాయి. మెగా హీరో సాయి దుర్గ తేజ్ జీవితంలో ఎదురైన ప్రమాదం, ఆ తర్వాత కోలుకున్న తీరు గురించి పంచుకున్న విషయాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. నిహారిక తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడున్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

సంబరాలు ఒకవైపు సాగుతుండగానే, టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఫైనల్ ఎపిసోడ్‌లో ఫైనలిస్టులు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో పోటీ పడనున్నారు. ముఖ్యంగా పుష్ప, గౌరవ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జడ్జీలను సైతం ఆశ్చర్యపరిచాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో చివరికి ‘ఆట’ విజేతగా ఎవరు నిలిచారు? జీ తెలుగు ఆట ట్రోఫీని ఎవరు కైవసం చేసుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే మే 2, 3 తేదీల్లో జీ తెలుగులో ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే చూడాల్సిందే.

ఆట గ్రాండ్ ఫినాలేలో సాయి దుర్గ తేజ్..

జీ తెలుగు ‘ఆట’టైటిల్ విజేత ఎవరు?.. తెలుసుకోవాలంటే ఈ శని, ఆదివారల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేని మిస్ కాకండి!

రాజశేఖర్, జీవిత దంపతుల ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ఆట' గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. ప్రోమోస్
'ఆట' గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. ప్రోమోస్
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!