Sobhita Dhulipala: చైతూతో పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది.. శోభితా ధూళిపాళ్ల..
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజమైన నటనతో అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

టాలీవుడ్ స్టార్ నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్కినేని వారసుడు, స్టార్ హీరో నాగచైతన్యతో ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే పెళ్లి తర్వాత తన ఆలోచన విధానం మారిందంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక నటుడితో ప్రేమలో పడడంపై తన పాత అభిప్రాయాలు ఎలా మారాయో అనే విషయాలను మనసు విప్పి చెప్పారు. నటీనటులతో ఎప్పటికీ డేటింగ్ చేయబోనని కెరీర్ ఆరంభంలో చెప్పిన ఆమె ఇప్పుడు అదే కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శోభిత తన వైవాహిక బంధం గురించి స్పందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ తన ఆలోచనా విధానం ఎలా మారిందో వివరించారు. తన వృత్తికి చెందిన వారితో డేటింగ్ చేయాలనుకోవడం లేదని 2016లో తాను చేసిన వ్యాఖ్యను గుర్తుచేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
“బహుశా నా చుట్టూ నేను చూసిన ఉదాహరణల వల్లేనేమో ఆ సమయంలో నేను ఒక మూసలో ఇరుక్కుపోయాను. అప్పుడు నా ఆలోచనా విధానం సంకుచితంగా ఉండి ఉంటుంది.” అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నమ్మారన్న కారణంతో ఒకే అభిప్రాయాలకు అంటిపెట్టుకుని ఉండకుండా, వయసు పెరిగే కొద్దీ విషయాలను భిన్నంగా చూసేందుకు ప్రజలు సుముఖంగా ఉండాలని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. “తమ అభిప్రాయాలను మార్చుకోని వారిని చూస్తే నాకు ఎక్కువ భయం. వేర్వేరు సమయాల్లో వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉండటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆమె అన్నారు.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
అలాగే నాగ చైతన్యతో వివాహం తర్వాత వ్యక్తిగత జీవితంపై పెరిగిన పబ్లిక్ ఫోకస్, సోషల్ మీడియా చర్చలపై ఆమె స్పందించారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని.. వాటితో అతిగా మమేకమైతే మన సొంత అస్తిత్వాన్ని కోల్పోతామని అన్నారు. “సమాజం వాతావరణం లాంటిది. అది వస్తూ పోతూ ఉంటుంది. మీరు ఆ వాతావరణంతోనే ఎక్కువగా మమేకమైతే, వాతావరణం మారినప్పుడు మీరు దారి తప్పిపోతారు. కాబట్టి, స్థిరంగా ఉంటూ, వాస్తవికత ఏమిటో గమనిస్తూ ఉండటం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఆ విషయం తెలుసుకునే అదృష్టం నాకు కలిగిందని భావిస్తున్నాను. స్థిరంగా ఉండటం అనేది మీరు తీసుకునే ఒక నిర్ణయం” అని ఆమె అన్నారు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
