AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ‘ధురంధర్ 2’ కాదు.. ఇప్పుడీ సినిమానే బాక్సాఫీస్ సెన్సేషన్.. 4 రోజుల్లోనే ఏకంగా 2800 కోట్లు

రణ్ వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ది రివేంజ్' (ధురంధర్ 2) జోరు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమా రికార్డులను ఒక బయోపిక్ బద్దలు కొడుతోంది.

Cinema: 'ధురంధర్ 2' కాదు.. ఇప్పుడీ సినిమానే బాక్సాఫీస్ సెన్సేషన్.. 4 రోజుల్లోనే ఏకంగా 2800 కోట్లు
Michael Movie
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 6:36 PM

Share

ప్రస్తుతం, బయోపిక్ చిత్రాల పట్ల ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖల జీవితాలకు సంబంధించిన రియల్ స్టోరీలకు కాసుల వర్షం కురుస్తోంది. సాధారణంగా ఇలాంటి బయోపిక్ సినిమాలు స్ఫూర్తినిస్తాయి. ఆయా రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల నిజ జీవితంలోని సంక్షోభాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అదే సమయంలో ఈ బయోపిక్స్ పట్ల కొంచెం నెగెటివీటీ కూడా ఉంది. ఇలాంటి సినిమాల్లో నిజాలను దాచి పెడతారన్న అపవాదు కూడా ఉంది. ఇటీవల విడుదలైన ‘మైఖేల్’ సినిమా విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఆంథోనీ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఈ బయోపిక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా $220.83 మిలియన్లు అంటే దాదాపు రూ. 2080 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారతదేశంలో ఈ మూవీ వసూళ్లు క్రమంగా పెరుగుతూ సుమారు రూ. 20 కోట్లకు చేరుకున్నాయి. సంగీత ప్రియులు, మైఖేల్ జాక్సన్ అభిమానులు ఈ చిత్రాన్ని చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ తో రాబోయే రోజుల్లో మైఖేల్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

‘మైఖేల్’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. 2026 సంవత్సరపు అగ్ర చిత్రాల జాబితాలో ఈ చిత్రం ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది. ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’, ‘పెగాసస్ 3’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘హాపర్’ ‘వుథరింగ్ హైట్స్’ వంటి సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో, కేవలం కొద్ది రోజుల్లోనే 1800 కోట్లు వసూలు చేసిన ‘ధురందర్ 2’ రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. అలాగే ‘భూత్ బంగ్లా’ కలెక్షన్లను కూడా అధిగమించింది. రాబోయే రోజుల్లో ‘మైఖేల్’ కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనూ రోజు రోజుకూ ఈ మూవీ వసూళ్లు పెరుగుతున్నాయని ..ఇదే కొనసాగితే త్వరలోనే ఈ బయోపిక్ ‘టాప్ 5’ లోకి కూడా చేరగలదని చాలామంది నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇండియాలోనూ మైఖేల్ సినిమాకు భారీ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..