AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

2022 డిసెంబరులో పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఓ వైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని చూసుకుంటోంది. ఇప్పుడీ అమ్మడు అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Tollywood: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Actress Sukrithi
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 7:25 PM

Share

కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ఆడియెన్స్ కు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ కేరింత సినిమాలో భావన అంటే ఇట్టే గుర్తు పడతారు. అందులో తన క్యూట్ యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయిందీ అందాల తార. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సుకృతికి కూడా మంచి పేరొచ్చింది. అయితే మరో సినిమా చేయలేదీ ముద్దుగుమ్మ. పూర్తిగా యాక్టింగ్ కెరీర్ ను పక్కన పెట్టేసింది. 2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న సుకృతి ఇప్పుడు శుభవార్త చెప్పింది. పెళ్లైన నాలుగేళ్లకు తల్లి కానున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు బీచ్ ఒడ్డున్న బేబీ బంప్‌తో దిగిన ఫొటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు సుకృతి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి చిన్నతనంలోనే మదర్ చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగింది. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసింది. చదువుతున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌కి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. కానీ వన్ ఫిల్మ్ వండర్ లా ఒక్కసినిమాకే పరిమితమైంది. మరే భాషలోనూ రెండో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

భర్తతో కేరింత హీరోయిన్..

సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సుకృతి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలు, ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!