AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడి ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ ఏకంగా వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 23, 2026 | 8:26 PM

Share

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ఆడియెన్స్ కూడా జానర్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అందుకే మలయాళంలో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన సంభవం అధ్యాయం ఒన్ను ఇప్పుడు ఓటీటీ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. మాలీవుడ్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఒక మేక చుట్టూ తిరిగే కథకు అతీంద్రియ శక్తులను జోడించి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు మేకర్స్. అలాగే అబ్బురపరిచే ఫాంటసీ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే.. నిడివి సుమారు రెండున్నర గంటలకు పైగా ఉన్నప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ మ్యాజిక్ చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

చాలా రోజులుగా మలయాళం సినిమాలు థియేటర్లలో రాకపోయినా తెలుగు డబ్బింగ్ వెర్షన్లు మాత్రం నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. అలా ఇప్పుడు ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 కూడా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షాన్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలందించారు.

ఇవి కూడా చదవండి

జీ5లో ఆడు 3 సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us