AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరో మెటీరియల్.. కానీ ఎందుకో వెనకపడ్డాడు.. ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

'అందం ఉంది. అభినయ ప్రతిభ కూడా ఉంది. చాలా కష్టపడతాడు కూడా.. హీరో మెటీరియల్.. కానీ ఎందుకో యాంకరింగ్ దగ్గరే ఆగిపోయాడు'.. ఇతనిని బాగా ఇష్టపడే అభిమానులు చెప్పుకునే మాటలివి. అందుకేనేమో సుమారు పదేళ్ల తర్వాత ఓ సినిమాలో నటిస్తున్నాడీ స్టార్ యాంకర్.

Tollywood: హీరో మెటీరియల్.. కానీ ఎందుకో వెనకపడ్డాడు.. ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 23, 2026 | 6:21 PM

Share

పై ఫొటోలో స్కూల్ డ్రెస్ లో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను టాలీవుడ్ టాప్ యాంకర్. ఎన్నో ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను హోస్టింగ్ చేస్తున్నాడు. సమయం, సందర్భానికి తగ్గట్టుగా కామెడీ పంచులు వేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ యాంకర్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే చాలా మందిలాగే ఇతను కూడా హీరో అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు కాదు.. పదేళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత ఓ సినిమాలో హీరోగానూ చేశాడు. కానీ సినిమా బాగా ఆడలేదు. అంతే మరో సినిమాలో కనిపించలేదు. మళ్లీ బుల్లితెరకు వచ్చేశాడు. ఇతనొక్కడే కాదు.. బుల్లితెర పై స్టార్స్ గా వెలిగిన ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, షకలక శంకర్, ధనరాజ్, అదిరే అభి ఇలా చాలా మంది నటులుగా నిలదొక్కుక్కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎదురు దెబ్బలు తగిలినా మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తున్నారు. అలా ఈ స్టార్ యాంకర్ కూడా సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను మరెవరో కాదు యాంకర్ రవి.

ఇవి కూడా చదవండి

పటాస్, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, కిర్రాక్ , అలీ టాకీస్ ,సమ్ థింగ్ స్పెషల్, తదితర టీవీ ప్రోగ్రామ్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు యాంకర్ రవి .అలాగే బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు యాంకర్ రవి. ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. విజేతగా నిలవకున్నా తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు.

క్యాస్ట్ సినిమా ప్రమోషన్లలో యాంకర్ రవి..

కాగా 2012 లో ఈ రోజుల్లో అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు రవి. ఆ తర్వాత 2017లో ఇది నా ప్రేమ కథ అనే సినిమాలో హీరోగా చేశాడు. కానీ ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీని తర్వాత మరే సినిమాలోనూ రవి కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు క్యాస్ట్ అనే ఓ సినిమాలో నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ యాంకర్. ఇందులో వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్ లతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు రవి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

భార్యా బిడ్డలతో యాంకర్ రవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?