AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాల్సింది.. కానీ.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం 21 ఏళ్లకే..

సిమ్రాన్‌కి మోనాల్, జ్యోతి ఆనంద్ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారు కూడా తెలుగులో సినిమాలు చేశారు. అయితే వీరిలో మోనాల్ కేవలం 21 ఏళ్లకే కన్నుమూసింది. అక్కలా స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న ఆమె అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంది.

Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాల్సింది.. కానీ.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం 21 ఏళ్లకే..
Simran Sister Monal
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 7:30 PM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది సిమ్రాన్. అయితే చాలా మంది లాగే సినిమా కెరీర్ స్పీడ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యాక్టింగ్ కు విరామం ఇచ్చింది. చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సహాయక నటి పాత్రలతో అదరగొడుతోంది. గతేడాది శబ్ధం, గుడ్ బ్యాడ్ అగ్లీ, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. అలాగే బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.సినిమాల సంగతి పక్కన పెడితే సిమ్రాన్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వారు కూడా సినిమాలు చేశారు.

ఇవి కూడా చదవండి

సిమ్రాన్ చెల్లెళ్ల పేర్లు మోనాల్, జ్యోతి ఆనంద్. వీరిలో మోనాల్ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఇష్టం అనే సినిమా నటించిన మోనాళ్ తమిళ్ లో దళపతి విజయ్ తో కలిసి బద్రి రీమేక్ లో యాక్ట్ చేసింది. అయితే సిమ్రాన్ లా స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న మోనాల్ 2002 ఏప్రిల్ 14న ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికీ ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. మోనాల్ ఆత్మహత్యతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. అయితే మోనాల్ ఆత్మహత్యకు కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని సిమ్రాన్ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో తన చెల్లెలిని మోసం చేశాడని.. దీంతో ఆ బాధ తట్టుకోలేక మోనాల్ ఆత్మహత్య చేసుకుందని సిమ్రాన్ వాపోయింది. అయితే ఆ తర్వాత ఈ కేసు నీరుగారిపోయింది. ఇప్పటికీ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ సూసైడ్ మిస్టరీగానే మిగిలిపోయింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన సిమ్రాన్..

View this post on Instagram

A post shared by SIMRAN (@simranrishibagga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us