AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekhar: ‘వైద్యో నారాయణో హరి’.. ఆ టాలీవుడ్ హీరో కూతురికి వైద్యం చేసి బతికించిన రాజశేఖర్.. సార్ చాలా గ్రేట్

యాంగ్రీమ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. డాక్టర్ అయిన తర్వాతే ఆయన నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన వైద్య వృత్తికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Rajashekhar: 'వైద్యో నారాయణో హరి'.. ఆ టాలీవుడ్ హీరో కూతురికి వైద్యం చేసి బతికించిన రాజశేఖర్.. సార్ చాలా గ్రేట్
Rajashekhar
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 5:19 PM

Share

యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ సెకెండ్ ఇన్నింగ్స్ లో విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఆ మధ్యన నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్రలో కనిపించిన రాజశేఖర్ ఇటీవల ‘బైకర్’ సినిమాలో శర్వానంద్ తండ్రి క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. గత నెలలో విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ గా నిలిచింది. హీరో పాత్రలో పాటు రాజశేఖర్ రోల్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాజశేఖర్ ఒక క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన డాక్టర్‌గా ప్రాక్టీస్ కూడా చేశారు. అయితే నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన రాజ శేఖర్ తన వైద్య వృత్తికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నేను హౌస్ సర్జన్ కోర్స్ ఫినిష్ చేసి తర్వాత డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాను. మేము అప్పుడు చెన్నై నగరంలోని అన్నానగర్ లో ఉండేవాళ్లం. నా పేరు మీద ఒక బోర్డ్ పెట్టి, ఇంట్లోనే క్లినిక్ రన్ చేశాను. అలానే మా ఇంటి నుంచి కొంచెం దూరంలో అంజిగరై అనే ఫేమస్ ప్లేస్ లో కూడా ప్రాక్టీస్ ప్రారంభించాను. సాయంత్రం టైమ్ లో అక్కడ అందుబాటులో ఉండేవాడిని. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంట్లో చూస్తుంటాను. అలా ఒకరోజు ఎమర్జెన్సీ కేసు వచ్చింది’

‘నోట్లో నుంచి నురుగ వస్తూ, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న 16 – 17 ఏళ్ల వయసు ఉండే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమెకు ఆస్తమా ఉంది. కండిషన్ చూస్తే చాలా బ్యాడ్ స్టేజ్ లో ఉన్నట్లు అనిపించింది. అదృష్టవశాత్తూ దాని చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ నా దగ్గర ఉంది. మామూలుగా అలాంటివి ఇంట్లో పెట్టుకోం. కానీ ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడుతుందని సేఫ్ సైడ్ తీసి పెట్టుకున్నాను. ఇమిడియేట్ గా ఆ ఇంజెక్షన్ అమ్మాయికి ఇచ్చాను. కొన్ని నిముషాల్లోనే అమ్మాయి బెటర్ గా అయింది. ఒక గంటలోనే లేచి కూర్చుంది.. మాట్లాడింది. నాకు వాళ్లు థ్యాంక్స్ చెప్పి వెళ్లారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది అదే రోజున వాళ్లు నా దగ్గరకు వచ్చి కేక్ కట్ చేయించి, స్వీట్లు చాక్లెట్స్ ఇచ్చి వెళ్తారు. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు మన యాక్టర్ సునీల్ కూతురు. ఆ పాప ఒక్కరికే కాదు చాలామందికి అలా ట్రీట్మెంట్ చేశాను. ఇప్పటికీ నేను ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కానీ అందుకు టైమ్ సరిపోవడం లేదు. కుదిరితే ఓవైపు నటిస్తూనే మరోవైపు డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను ‘ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సునీల్ కూతురు

Sunil Daughter

Sunil Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us