AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే

బ్రాండెడ్ వస్తువుల పేరుతో తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన తొమ్మిది మంది సభ్యుల ముఠా హైదరాబాద్ లక్ష్యంగా ఈ మోసాలకు పాలడుతున్నే పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.

Hyderabad: అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే
Fake Iphone Scam Hyderabad
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 9:06 PM

Share

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నకిలీ ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అనాజ్, మహమ్మద్ ఫార్మన్, మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ జునీద్, మోహిద్ వాసిన్, మహమ్మద్ సోయబ్ కురుషి, ధనుష్ అహ్మద్, మోహిద్ షకీబ్, రవి కమలేష్ గుప్తాలు ఒక ముఠాగా ఏర్పడి.. ఘజియాబాద్ నుండి భారీ సంఖ్యలో నకిలీ ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ , ఆపిల్ వాచీలను సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు తెలిపారు.

ఈ 9 మంది ముఠా ముఖ్యంగా హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్, శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో తిరుగుతూ.. అత్యవసరంగా డబ్బులు కావాలని లేదా తక్కువ ధరకే కొత్త మోడల్ ఐఫోన్లు ఇస్తామని అమాయకులను నమ్మించి వారి నుంచి డబ్బులు కాజేసే వారని గుర్తించారు. అవి నకిలీవని తెలియని బాధితులు, నిందితులు చెప్పే మాటలు నమ్మి వేలకు వేలు చెల్లించి మోసపోయారని తెలిపారు.

కొందరు బాధితులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరిపై నిఘా పెట్టి, ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు నకిలీ ఆపిల్ మొబైల్ ఫోన్స్, 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని.. పరారీలో ఉన్న దినేష్ అహ్మద్, మహమ్మద్ రవి, కమలేష్ గుప్తాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

అపరిచిత వ్యక్తులు రోడ్లపై తక్కువ ధరకే ఐఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. కేవలం గుర్తింపు పొందిన షోరూమ్‌లలోనే వస్తువులను కొనుగోలు చేయాలని, ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో