రాజస్థాన్లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండేళ్ల క్రితం చోరీకి గురైన నగలు, పూజా సామగ్రి తిరిగి లభించాయి. దొంగ క్షమాపణ లేఖ, మరమ్మత్తుల ఖర్చుకు డబ్బుతో పాటు దొంగిలించిన వస్తువులను ఆలయ ప్రాంగణంలో వదిలి వెళ్ళాడు. మత్తులో తప్పు చేశానని, తనను క్షమించమని లేఖలో వేడుకున్నాడు.